వైసీపీ ఎంపీ విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ పై నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేసింది సీబీఐ. దీనికి సంబంధించిన మెమో దాఖలు చేసింది.
మరోవైపు సీబీఐ నిర్ణయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు విజయసాయిరెడ్డి. తదుపరి విచారణను 16కు వాయిదా వేసింది న్యాయస్థానం. జగన్ కేసులకు సంబంధించి విజయసాయి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ పిటిషన్ వేశారు.