ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ పై మరో కేసు నమోదైంది. 2004-09 మధ్య రైల్వే మంత్రిగా లాలు ఉన్న సమయంలో రైల్వే రిక్రూట్ మెంట్ లో అక్రమాలు చోటుచేసుకున్నాయని సీబీఐ ఆరోపించింది.
దానికి ఆయనను బాధ్యుడిగా పేర్కొంటు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లను కూడా సీబీఐ చేర్చింది.
ఈ కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేతతో పాటు పలువురు ఇండ్లలో సీబీఐ దాడులు చేస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్టు సీబీఐ అధికారి ఒకరు వివరించారు.
దొరండా ట్రెజరీ కుంభకోణం కేసులో ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత గత నెలలో ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.