జమ్మూ కశ్మీర్ లోని మాజీ అధికారుల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత సీబీఐ పెద్ద ఎత్తున మాజీ అధికారుల ఇశ్లపై దాడులు నిర్వహించడం ఇదే మొదటి సారి. శ్రీనగర్ లోని 13 ప్రాంతాలు, జమ్మూ, కశ్మీర్, నోయిడా లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. జమ్మూ కశ్మీర్ లో అక్రమంగా రెండు లక్షలకు పైగా ఆయుధ లైసెన్స్ లను జారీ చేసినట్టు ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. సోమవారం రోజు కుప్వారా, బారాముల్లా, ఉద్ధంపూర్, కిష్ట్వార్, సోపియాన్, రాజౌరి, దోడ, పుల్వామా మాజీ డిప్యూటీ కమిషనర్లు (డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బందీపొరాకు చెందిన రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి ఇట్రాట్ హుస్సేన్ రఫీఖి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి.
2017 జనవరి నుంచి 2018 ఫిబ్రవరి వరకు ఇచ్చిన గన్ లైసెన్స్ ల్లో అక్రమాలు జరిగినట్టు తెలియడంతో 2018 జులై 18న జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఆ లైసెన్స్ లను రద్దు చేసింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది.నిబంధనలు ఉల్లంఘించి అప్పటి అధికారులు జమ్మూ కశ్మీర్ కు చెందని వారికి కూడా లైసెన్స్ లు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి.