ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేషనల్ స్టాక్ ఎక్చేంజీ(ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు చుక్కెదురైంది. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
దీంతో ఎన్ఎస్ఈకి సంబంధించిన కేసులో ఆమెను అరెస్టు చేసేందుకు సీబీఐ రెడీ అవుతున్నట్టు సమాచారం. మరో వైపు ఆమె ఢిల్లీ హైకోర్టున ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక విషయాలను ఆమె ఓ హిమాలయ యోగితో పంచుకున్నారని, ఎన్ఎస్ఈ గ్రూపు ఆపరేటింగ్ అధికారిగా, ఎండీగా సలహాదారుగా ఆనంద్ సుబ్రమణియన్ ను నియమించే సమయంలో అవకతవకలకు పాల్పడినట్టు సెబీ ప్రకటించింది.
సెబీ ప్రకటన తర్వాత చిత్రా రామకృష్ణ ఇంట్లో ఆదాయపన్ను(ఐటీ) శాఖ సోదాలు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో సీబీఐ ఆమెను ప్రశ్నించింది.