కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రానైట్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగుతోంది. జిల్లాలో జరుగుతున్న గ్రానైట్ అక్రమాలపై బీజేపీ సీనియర్ నేత పేరాల శేఖర్ రావు గతంలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడానికి సీడీఐ అంగీకరించింది. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం నుండి వైజాగ్ బ్రాంచ్ కు సమాచారం అందింది.
కరీంనగర్ గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాయి. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ విశాఖ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ పోర్టు నుంచి కరీంనగర్ గ్రానైట్ విదేశాలకు ఎగుమతి అయింది. 2011లో కాకినాడ పోర్టులో సోదాలు నిర్వహించిన అధికారులు అక్రమంగా గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు.
అక్రమ ఎగుమతులపై పలు సంస్థలకు నోటీసులు ఇచ్చిన అధికారులు భారీగా జరిమానా విధించారు. అప్పట్లో మైనింగ్ కంపెనీలకు రూ.750 కోట్ల జరిమానా విధించినట్టు బీజేపీ నేత శేఖర్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. పన్ను ఎగవేత, మనీలాండరింగ్, అక్రమ మైనింగ్, అక్రమ రవాణా, ఎగుమతులపై కేంద్ర విచారణ సంస్థలు, సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాయి.
letter of chief secretary and asst director mines
DocScanner Oct 31, 2021 10.28 AM
Advertisements
DocScanner Feb 18, 2022 6-58 PM