ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు సీబీఐ సమన్లు పంపింది. ఈ నెలలో ఆయకు సమన్లు రావడం ఇది రెండో సారి. అంతకు ముందు ఈ నెల 4న ఇదే కుంభకోణంలో సీబీఐ ఆయనకు సమన్లు పంపింది.
ఇటీవల ఈ కుంభకోణానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీతో పాటు పాట్నా, రాంచీ, ముంబై ఇతర ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ఢిల్లీలోని తేజస్వీ యాదవ్ నివాసంతో పాటు మొత్తం 24 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది.
ఈ కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని సీబీఐ సోమవారం ప్రశ్నించింది. ఆ తర్వాత శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన కుమార్తె నివాసంలో సీబీఐ విచారించింది. సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈఢీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది.
దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని తేజస్వీ యాదవ్ అంతకు ముందు అన్నారు. బీజేపీ తన శత్రువులపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించి భయ పెట్టాలని చూస్తున్నదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన పేర్కొన్నారు.