లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదివారం సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. అయితే ఢిల్లీ ఆర్ధిక మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న తనపై బడ్జెట్ ను సమర్పించవలసిన బాధ్యత కూడా ఉన్నందున తనకు మరింత సమయం ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. ‘ఈ మాసాంతం వరకు నాకు టైమివ్వండి. ఈ నెలాఖరులో మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీ ప్రశ్నలకు సమాధానమిస్తాను’ అని సిసోడియా వారికి స్పష్టం చేశారు.
బడ్జెట్ రూపకల్పన అతి ముఖ్యమైనదని, అందువల్ల తేదీ మార్చాలని వారిని కోరానని ఆయన వెల్లడించారు. ఈ దర్యాప్తు సంస్థలకు తానెప్పుడూ సహకరిస్తూనే వచ్చానన్నారు. ఈ కేసులో ఈయన పేరును సిబిఐ దాఖలు చేసిన తన మొదటి ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు. కానీ ఆయనపై దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది.
తనను ఆదివారం అరెస్టు చేయవచ్చునని భావించానని, ఇందుకు బీజేపీ ముందే ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చునని మనీష్ సిసోడియా అన్నారు. కానీ అరెస్టుకు తాను భయపడబోనని, సిబిఐ అధికారుల ప్రశ్నలకు బెదిరి పారిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
నన్ను ప్రశ్నించే తేదీని వాయిదా వేయాలని అధికారులను కోరినట్టు ఆయన పునరుద్ఘాటించారు. దీంతో ఆయనకు సీబీఐ మళ్ళీ సమన్లు జారీ చేయవచ్చునని భావిస్తున్నారు.