కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని సీబీఎస్ఈని పదవ తరగతి, 12వ తరగతి విద్యార్థులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దేశంలో దాదాపు లక్ష మంది విద్యార్థులు ఆన్ లైన్ లో పిటిషన్ పై సంతకాలు చేసి బోర్డుకు చేరేలా ప్రయత్నించారు.
తాజాగా విద్యార్థుల డిమాండ్ పై బోర్డు స్పందించింది. 2021బోర్డు ఎగ్జామ్ కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా జాగ్రత్తలతోనే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలు వాయిదా వేయటం కుదరదని… విద్యార్థులంతా ముందుగా ప్రకటించినట్లుగా మే 4 నుండి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది.
ఈ కరోనా వల్ల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు హజరుకాలేకపోయిన విద్యార్థులకు మరో ఛాన్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాంటి వారు వారి కుటుంబ సభ్యులకు కానీ, విద్యార్థికి కానీ కరోనా వచ్చినట్లుగా రిపోర్ట్ చూపిస్తే… స్కూల్ అధికారులు జూన్ 11లోపు వారికి పరీక్ష నిర్వహిస్తారని తెలిపింది.