కార్వీ ఎండీ పార్ధసారథిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 780 కోట్ల బ్యాంకు రుణాలను ఎగరవేశారని ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ రుణాల్లో రూ. 720 కోట్ల నిధులను పార్ధసారథి దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
బజాజ్ ఫైనాన్స్, ICICI, HDFC, ఇండస్ ఇండ్, కోటక్ బ్యాంకుల నుంచి పార్ధసారథి రుణాలు తీసుకున్నారు. అయితే మళ్లీ ఆ సొమ్ము చెల్లించకుండా ఎగవేయడంతో… బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. మార్గదర్శకాలను పాటించని కారణంగా కార్వీపై గతంలోనే సెబీ నిషేధం విధించింది.