కర్ణాటకలో ఎన్నికలకు ముందు ఆడియోలు, సీడీలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికకే రాష్ట్ర మంత్రి రమేశ్ జార్కి హోళికి సంబంధించిన రాసలీలల సిడీలు బయటకు రావడంతో దుమారం రేగింది. ఈ క్రమంలో ఆయన తన మంత్రి పదవిని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది.
దీంతో కేవీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పై రమేశ్ జార్కి హోళి ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే పలు మార్లు శివకుమార్‌కు జార్కిహోళి సవాళ్లు విసిరారు. తాజాగా డీ.కే. శివకుమార్‌కు చెందిన ఓ ఆడియోను జార్కిహోళి విడదుల చేశారు. ఆ ఆడియో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
బెంగళూరు సదా శివనగర్‌లోని రమేశ్ జార్కిహొళి నివాసంలోకి దూసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ లఖన్ జార్కిహొళి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
కొన్నేండ్లుగా బెళగావి కేంద్రంగా సీడీల తయారీ కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతం నుంచే కనకపుర కేంద్రానికి, ఆ తర్వాత బెంగళూరుకు వెళుతున్నాయని పేర్కొన్నారు. సీడీల తయారీ వెనుక దాగిన కుట్రను వెలుగులోకి తీసుకు రావాలంటే సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు జరిపించాలన్నారు.
తాజాగా కర్ణాటక ఎమ్మెల్యే బాల చంద్ర జార్కిహొళి మాట్లాడుతూ… సీడీలు, ఆడియోల సవాళ్లతో రమేశ్ జార్కిహోళి ఒక్కరికి మాత్రమే కాకుండా డీకే శివకుమార్‌తో పాటు ఎమ్మెల్యే లక్ష్మీహెబ్బాళ్కర్‌కు రాజకీయంగా ఇబ్బందికరమేనని వెల్లడించారు. వారు ముగ్గురు పేరున్న వారేనని, కుటుంబాలకు చరిత్ర ఉందన్నారు. వారు ఒకరిపై మరొకరు కక్ష తీర్చుకునేందుకు మరింత ముందుకెళితే ప్రమాదకరమేనని వెల్లడించారు.