బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాని మోడీ సమక్షంలో కేంద్ర మంత్రివర్గం భేటీ అయింది. ప్రమాదంపై ప్రధానికి రాజ్‌నాథ్ వివరించారు.
ఇప్పటిదాకా ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో నాలుగు మృతదేహాలను గుర్తించారు అధికారులు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.
తీవ్రగాయాలతో ఉన్న బిపిన్ రావత్ ను ఆసుపత్రికి చేర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఇటు బిపిన్ భార్య మధులిక రావత్ ఈ ప్రమాదంలో కన్నుమూశారు.