ఉగ్రవాదానికి సహాయం చేసే దేశాలున్నంత కాలం ఉగ్రవాదం ఉంటుందని…ఉగ్రవాదం అంతానికి 9/11 దాడి అనంతరం అమెరికా అనుసరించిన విధానమే సరైందని ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. పాకిస్థాన్ పేరు ఎత్తకుండా ఆ దేశానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ” టెర్రరిస్టులకు ఆయుధాలు సమకూరుస్తు…నిధులు అందజేస్తు…వారికి సహాయం చేసే దేశాలున్నంత వరకు టెర్రరిజాన్ని నియంత్రించలేం” అని బిపిన్ రావత్ అన్నారు
టెర్రరిజానికి అంతం పలకాలంటే 9/11 దాడుల తర్వాత అమెరికా అనుసరించిన విధానమే సరైనదన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు యుద్ధం ప్రకటించాలన్నారు. దీంతో టెర్రరిస్టులను దూరం చేయవచ్చు. టెర్రరిస్టులకు సహాయం చేసే దేశాలు ఇబ్బందుల్లో పడతాయని రావత్ చెప్పారు. టెర్రరిస్టులకు సహాయం చేసే దేశాలకు ఆర్ధిక సహాయాన్ని నిలిపివేయడం అన్నింటి కంటే మంచి పని అని రావత్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన ఇండియా చీఫ్ డిఫెన్స్ స్టాప్ హోదాలో రావత్ పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు.
ఉగ్రవాదానికి సహాయం చేసే దేశాలున్నంత కాలం ఉగ్రవాదం ఉంటుందని…ఉగ్రవాదం అంతానికి 9/11 దాడి అనంతరం అమెరికా అనుసరించిన విధానమే సరైందని ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. పాకిస్థాన్ పేరు ఎత్తకుండా ఆ దేశానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ” టెర్రరిస్టులకు ఆయుధాలు సమకూరుస్తు…నిధులు అందజేస్తు…వారికి సహాయం చేసే దేశాలున్నంత వరకు టెర్రరిజాన్ని నియంత్రించలేం” అని బిపిన్ రావత్ అన్నారు.