జమిలీ ఎన్నికలపై జరుగుతున్న చర్చకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ఊతం ఇవ్వగా, ఎన్నికలకు తాము కూడా రెడీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ప్రకటన చేశారు.
ఒకే దేశం… ఒకే ఎలక్షన్ అన్న నూతన పద్ధతిని అమలు చేయడానికి తాము సిద్ధమని అన్నారు. జమిలీ ఎన్నికలకు మేం సిద్ధమే. పార్లమెంట్ వీటిపై విస్తృతమైన సవరణలు చేసిన తర్వాత… వన్ కంట్రీ- వన్ నేషన్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధమేనన్నారు.
ఇటీవల రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో జమిలీ ఎన్నికలు అనే అంశం చర్చించే విషయం మాత్రమే కాదని, భారత్‌కు ఎంతో అవసరమని ఆయన కామెంట్ చేశారు. పదే పదే ఎన్నికలు నిర్వహించటం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు.