మీరంతా సాహో సినిమా చూసే ఉంటారు. బిల్డింగ్ లో ఎక్కడో పై అంతస్తులో ఉన్న లాకర్ బాక్స్ పేలుడుకి ఒక్కో అంతస్తు శ్లాబ్ ని పగులగొట్టుకుంటూ వస్తుంది. కాస్త ఇంచుమించుగా అలాంటిదే ముంబైలో జరిగింది. భవనం పై అంతస్తుల్లో పేలుడు సంభవించటం వల్ల స్లాబ్ కూలిపోయి కింద అంతస్తు స్లాబ్ పై పడింది. అలా ఒక దాని బరువు ఇంకో దానిపై పడి.. ఐదు స్లాబులు కూలిపోయాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవీ ముంబైలోని నేరుల్ ప్రాంతం సెక్టార్ 19 లో ఉన్న జిమ్మి పార్క్ భవనంలో ఈ ఘటన జరిగింది. ప్రజలు భవనం మొత్తం కూలిపోతూందేమో అన్న భయంతో బయటకు పరుగులు తీశారు. అయినప్పటికీ శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమో అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే బేలాపుర్ నియోజక వర్గ ఎమ్మెల్యే మందా మ్హాత్రే, పోలీసు కమిషనర్ అభిజీత్ బాంగర్ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.
Advertisements
అన్ని విధాలా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పించారు.