తెతెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి రామయ్య ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఈ వేడుకలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. స్వామివారి కళ్యాణానికి భద్రాద్రి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు అధికారులు.
కాగా.. కళ్యాణానికి ఇంకా వారంరోజుల సమయం ఉండగా.. ఈ వారం రోజుల పాటు.. ఆలయ ప్రాంగనంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. నేటి నుండి ఈ నెల 16 వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నట్టు ఆలయ కమిటీ వెల్లడించింది.
ఏప్రిల్ 9న ఎదుర్కోలు, 10న కల్యాణ వేడుక, 11న పట్టాభిషేకం కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన శ్రీరామ చంద్రుని కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుందని వివరించారు.
కరోనా కారణంగా రెండేళ్ల నుంచి కళ్యాణ మహోత్సవాలు ఆంక్షలతో సింపుల్ గా జరుతున్నాయని.. ఈ ఏడు కరోనా తగ్గుముఖం పట్టడంతో శ్రీరామ నవమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు చెప్తున్నారు.