అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.- ప్రధాని మోడీ
సిరివెన్నెల అభిమానుల్లో నేను ఒకన్ని. ఆయన రాసిన పాటలు ప్రపంచంలో ఎవరూ మరువరు- ఉపరాష్ట్రపతి వెంకయ్య
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి- గవర్నర్ తమిళిసై
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది- కిషన్ రెడ్డి
తన పాటలతో సిరివెన్నెల ఎప్పటికీ బతికే ఉంటారు. ఆయన మరణం జీర్ణించుకోలేనిది. సాహిత్యానికి ఇది చీకటి రోజు. వేటూరి తర్వాత అంతటి గొప్ప సాహిత్య విలువలు ఈ తరానికి అందించారు సిరివెన్నెల- చిరంజీవి
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరనే వార్త నన్ను తీవ్ర మానస్థాపానికి గురి చేసింది. అలుపెరగక రాసిన ఆయన కలం నేడు ఆగినా… ఆయన రాసిన పాటలు తెలుగు భాష ఉన్నంత కాలం చిరస్మరణీయం- జూనియర్ ఎన్టీఆర్
మీరు అందమైన పదాలు, పాటలతో మాకు మిగిలిపోయారు సీతారామశాస్త్రి గారూ. అవి మాకు చిరస్థాయిగా ఉంటాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను- నాగార్జున
నా జీవన గమనానికి దిశానిర్దేశం చేసిన సీతారామశాస్త్రి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా- రాజమౌళి
సీతారామాశాస్త్రి మరణం సినీ రంగానికి, సమాజానికి తీరని లోటు. ఆయన రచనలు సహజంగా ఉంటూనే విప్లవ ఆలోచనలు ప్రతిబింబిస్తాయి- సీపీఐ నారాయణ
సీతారామశాస్త్రి నాకు అత్యంత సన్నిహితుడు. సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి- మోహన్ బాబు
చుక్కల్లారా.. చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలి?- కీరవాణి
జగమంత కుటుంబం ఆయనది. ఆయన లేని ఏకాకి జీవితం మాది. మా జీవితాల్లో కవిత్వాన్ని నింపినందుకు ధన్యవాదాలు గురూజీ- ప్రకాష్ రాజ్
ఇది నమ్మలేని నిజం. నేను నా ఎడమ భుజాన్ని కోల్పోయా. ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో తెలియడం లేదు- కె.విశ్వనాథ్
సినిమా పాటలకు సాహితీ గౌరవం కల్పించిన గొప్ప వ్యక్తి సిరివెన్నెల. తెలుగు పాటలను దశదిశలా వ్యాపింపచేసిన మహనీయుడు- బాలకృష్ణ
దాదాపు 3వేల పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన సీతారామశాస్త్రి మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు- చంద్రబాబు నాయుడు
సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన విన్యాసాలు తెలుగు భాష చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు- జగన్
వాగ్దేవి వరప్రసాదంగా మన తెలుగునాట నడయాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. బలమైన భావాన్ని, మానవత్వాన్ని, ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి సిరివెన్నెల- పవన్ కళ్యాణ్
తనపాటల ద్వారా చైతన్యం నింపిన సిరివెన్నెల… కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు- కేటీఆర్
కలం ఆగిపోయింది ఒక చరిత్ర ముగిసింది- వైజయంతీ మూవీస్
ఊహించని చేదు నిజం గుండెను పిండేసినా ఆ కవనాలతో ఊపిరి పోసుకున్న పాటల తోడులోని తీపిని మృదయాలలో ధరిస్తూ, స్మరిస్తూ, తరిస్తూ ఈ అశ్రునివాళి- ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందం