ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యం తో మృతి చెందిన సంగతి తెలిసిందే.అయితే నేడు మహాప్రస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని పెట్టారు.
ఈ నేపథ్యంలోనే ఫిలిం ఛాంబర్ కు వచ్చి పెద్ద ఎత్తున అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, వెంకటేష్, రానా, తనికెళ్ల భరణి, రావు రమేష్, ఎస్ వి కృష్ణారెడ్డి, మంత్రి పేర్ని నాని. మంత్రి తలసాని, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ ఎస్ థమన్, జీవిత రాజశేఖర్, నరేష్, జగపతి బాబు, కొరటాల తదితరులు సిరివెన్నెల కు నివాళులు అర్పించి సిరివెన్నెల తో ఉన్న బంధం గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Advertisements