2020 కొరోనా ప్రపంచ వ్యాప్తంగా టీట్వంటీ ఆడుకుంది. ఇంకా దాని ధాటి తగ్గలేదు. కానీ ఇదే సమయంలో కొందరు సెలెబ్రిటీలు వైవాహిక జీవితంలో ఓ కొత్త అడుగువేసి రెండవ పెళ్ళి చేసుకున్నారు. ఆ సెలెబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం!
దిల్ రాజు – తేజస్విని :
2020లో మొదట దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 లో అనారోగ్యంతో మరణించారు. ఆమె మరణం తర్వాత 3 ఏళ్లు ఒంటరిగానే ఉన్న దిల్ రాజు కూతురి సలహా మేరకు తేజస్విని పెళ్లి చేసుకున్నారు.
సామ్రాట్ – శ్రీ లిఖిత:
బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్ సామ్రాట్ కూడా ఈ కొరోనా టైమ్ లోనే సెకెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు. గతంలో హర్షితను పెళ్లి చేసుకున్న సామ్రాట్ ….. ఆ రిలేషన్ వర్కౌట్ కాకపోవడంతో విడాకులు తీసుకొని అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాడు… 2020లో కాకినాడకి చెందిన శ్రీలిఖితను వివాహం చేసుకున్నాడు.
సునీత – రామ్ :
19 ఏళ్ల వయస్సుల్లో కిరణ్ కుమార్ గోపరాజుతో సునితకు వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు…కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా విడాకులు తీసుకున్న సునిత అప్పటి నుండి ఒంటరిగానే ఉంటోంది. తాజాగా రామ్ ను పెళ్లిచేసుకున్నట్లు అధికార ప్రకటన చేసింది. రామ్ ఓ డిజిటల్ మీడియా హౌస్ కు CEO గా వ్యవహరిస్తున్నారు.