మాతృత్వం స్త్రీజాతి జన్మహక్కు. మానవ జాతి మనుగడకు ఆడదే ఆధారం. పురిటి నొప్పులు అనుభవించి మరో బిడ్డకు జన్మనివ్వడమంటే స్త్రీ మరో జన్మఎత్తినట్టే అంటారు.
బిడ్డను కనడంతో ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మునుపటి అందం, శరీర దారుఢ్యం, ఆరోగ్యం తారుమారయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఒకప్పుడు మాతృత్వాన్ని పొందాలంటే వీటన్నిటికీ సిద్ధపడాల్సిందే.
కానీ ప్రస్తుత కాలంలో వైద్యరంగం సాధించిన ప్రగతి కారణంగా ఒకరి బిడ్డను మరొకరు గర్భంలో మోసే వెసులు బాటు కలిగుతోంది. వైద్య పరిభాషలో ఈ విధానాన్నే సరోగసీ అంటారు.
చాలా మంది సెలబ్రిటీలు ఈ విధానాన్ని ఉపయోగించుకుని సంతానాన్ని పొందుతూ తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సినిమా,మోడలింగ్ లాంటి గ్లామర్ ఫీల్డ్ లో ఈ విధానం ద్వారా ఎంతో మంది హీరోయిన్లు పిల్లల్ని కంటున్నారు.
ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ లో బిడ్డను కనడం అంటే చాలా వరకూ తమకెరీర్ కి ఫుల్ స్టాప్ పడినట్లే. అందుకే చాలా మంది హీరోయిన్లు ఈ సరోగసీ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆ నటీ,నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1 లక్ష్మీ మంచు
లక్ష్మీ మంచు సరోగసీ పద్ధతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు.
2 ప్రీతి జింటా
ప్రీతి జింటా కూడా సోషల్ మీడియా ద్వారా సరోగసీ ద్వారా వారికి పిల్లలు కలిగినట్టు ప్రకటించారు.
3 అమీర్ ఖాన్
అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.
4. ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు చెప్పారు.
5.షారుక్ ఖాన్
షారుక్ ఖాన్, గౌరీ దంపతులు కూడా వారి మూడవ సంతానం కోసం సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.
6. శిల్పా శెట్టి
శిల్పా శెట్టి దంపతులు కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు ప్రకటించారు.
7. సన్నీ లియోన్
సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు.
8.ఏక్తాకపూర్
బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.
9.కరణ్ జోహార్
బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సరోగసీ పద్ధతిని ఎంచుకున్నారు.
10 నయనతార
నయనతార దంపతులు ఇవాళ కవల పిల్లలకి జన్మనిచ్చినట్టు ప్రకటించారు. వారు కూడా సరోగసీ ఈ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయినట్టు సమాచారం.
11 తుషార్ కపూర్
ప్రముఖ నటుడు తుషార్ కపూర్ అప్పుడు కూడా సరోగసి పద్ధతితో ఒక బాబుకి సింగిల్ పేరెంట్ గా ఉన్నారు.
వీరే కాకుండా ఇంకా చాలా మంది నటులు సరోగసీ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు.