పిల్లలు పుట్టాలి అనే కోరిక అందరికి ఉంటుంది. కొందరికి ఆస్తులు ఉన్నా సరే వారసులు ఉండరు. దీనితో చాలా వరకు పిల్లలను కనడానికి అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేసి… సరోగసి అనే విధానంలో పిల్లలని కనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో సినీ ప్రముఖులు ఎక్కువగా ఉన్నారు. అద్దె గర్భం ద్వారా, టెస్ట్ ట్యూబ్ బేబీస్ ద్వారా పిల్లలను కనే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : జైచిరంజీవలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి ఎలా ఉందో చూడండి…!
సన్నీ లియోన్

సన్నీ లియోన్… ఒక బిడ్డని దత్తత తీసుకుంది. ఆ తర్వాత కవల పిల్లలను సరోగసి ద్వారా పొందడం తో అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు వారిని చాలా బాగా చూసుకుంటుంది.
అమీర్ ఖాన్

మిస్టర్ పర్ఫెక్ట్ గా చెప్పుకునే అమీర్ ఖాన్ కు ఆయన మాజీ భార్య రీనాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ రావు ని వివాహం చేసుకుని సరోగసి ద్వారా ఒక కొడుకుని కన్నారు. కిరణ్ రావు కి అనారోగ్య సమస్య రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
షారుఖ్ ఖాన్

షారూక్ గౌరీ ఖాన్ దంపతుల మూడో కుమారుడు కూడా ఇలాగే జన్మించాడు. ప్రస్తుతం ఆ బిడ్డ తల్లి గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. గౌరీ సోదరుడి భార్య నమిత చబ్బెర్ ద్వారా ఈ బిడ్డను కన్నారు. 40 ఏళ్ళ వయసులో గౌరీ ఆరోగ్యం బాగోక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫరా ఖాన్
డైరెక్టర్ ఫరాఖాన్, శిరీష్ కుంధర్ ల ముగ్గురు బిడ్డలు కూడా సరోగసి ద్వారా పుట్టిన వారే కావడం విశేషం. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా ఒకరు అబ్బాయి. ఫరా ఖాన్ వయసు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తుషార్ కపూర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు తుషార్ కపూర్… పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు తండ్రి కావాలనుకుని సరోగసి ద్వారా బిడ్డను కన్నాడు. సింగిల్ పేరెంట్ గా ఉంటూనే బిడ్డను చాలా బాగా చేసుకుంటున్నాడు.
కరణ్ జోహార్
బాలీవుడ్ బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న కరణ్ జోహార్ పిల్లలు కూడా ఇలా పుట్టిన వారే కావడం విశేషం. తన తల్లి సాయంతో వారిని చూసుకుంటూ ఉంటాడు.
మంచు లక్ష్మి
మోహన్ బాబు గారాల పట్టీ అయిన మంచు లక్ష్మీ… తన బిడ్డను ఇలాగే పొందారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రై చేస్తే ఇబ్బందులు వస్తాయని సరోగేట్ మదర్ కోసం… గుజరాత్ వెళ్లివచ్చారు.
Also Read: మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్… ఈ సినిమాలో హీరో…!