సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కొందరు. వారసులుగా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేసినా సరే వాళ్లకు అద్రుష్టం కలిసి రాక ఇబ్బందులు పడి సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వారి జాబితా ఒకసారి చూద్దాం.
రమేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత సినిమా పరిశ్రమ నుంచి బయటకు వెళ్ళారు. కొన్ని సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
సుమంత్:

అక్కినేని ఫ్యామిలీ లో నాగార్జున తర్వాత అడుగు పెట్టినా సరే సుమంత్… కథల ఎంపిక విషయంలో చేసిన తప్పులతో కెరీర్ లో ఎక్కువ రోజులు నిలబడలేదు. అప్పుడప్పుడు సినిమాల్లో కనపడుతున్నాడు.
మంచు విష్ణు, మనోజ్: మోహన్ బాబు వారసులుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఇద్దరూ సోదరులు ఇప్పుడు సినిమా పరిశ్రమ నుంచి దాదాపుగా దూరంగానే ఉన్నారు. మంచు విష్ణు అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు.
తరుణ్:

రోజా రమణి కుమారుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చినా సరే కెరీర్ లో సరైన కథలు లేక ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు వ్యాపారాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసాడు.
నాగేంద్ర బాబు:

Advertisements
మెగాస్టార్ చిరంజీవి తర్వాత సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆయన… ఎక్కువ కాలం నిలబడలేదు. అయితే ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తూ సందడి చేస్తున్నారు.