జుట్టు రాలడం అనేది మనం నిత్య జీవితంలో అనుభవించే అతి పెద్ద సమస్య అని చెప్పవచ్చు. ఈ సమస్యను మనమే కాదు… మన సెలబ్రిటీలు కూడా అనుభవిస్తున్నారంట… అందుకే వారు మనకు కొన్ని సలహాలు ఇవ్వడానికి వచ్చేశారు.
ప్రస్తుతం వర్షాకాలం కారణంగా జుట్టు తేమగా ఉంటోంది. దీని వలన చుండ్రు కూడా అధికమవుతుంది. ఏదైనా మోడ్రన్ జడ వేసుకున్నప్పుడు చుండ్రు విపరీతంగా కనిపిస్తోంది. దాని వలన నలుగురిలోనికి వెళ్లినప్పుడు కూడా అధికంగా దుస్తులు మీద పడి కనపడుతుంటుంది. అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందాలంటే మనకి నచ్చిన విధంగా జుట్టును కట్టేస్తే చాలు అంటున్నారు మన బాలీవుడ్ భామలు.
సమస్యలను నివారించుకునేందుకు అవసరమైన హెయిర్ కేర్ ప్రొడక్ట్ లు మా వద్ద ఉన్నప్పటికీ… జుట్టును వివిధ రకాలుగా కట్టి చుండ్రు,పల్చబడడం వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు.
అలియా భట్:
మీకు మీ జుట్టును పూర్తిగా అల్లడం ఇష్టం లేదా అయితే దానిని అలలుగా, కర్ల్స్ కలిపిన దానిలా చేస్తే మీ జుట్టు పలచబడినట్లు తెలియదు. అంతేకాకుండా చుండ్రు ఉన్నట్లుగా కూడా పెద్దగా తెలియదు అంటూ సలహానిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
దిశాపటానీ:
కేవలం బాడీకి మాత్రమే వెచ్చదనం ఉంటే సరిపోదు. జుట్టుకు కూడా వెచ్చదనం కావాలంటే నాలాగా మీరు కూడా రిబ్బన్లు పెట్టి గట్టిగా కట్టివేయండి అంటూ సలహా ఇస్తుంది భామ.
సోనమ్ కపూర్ అహూజా:
ముత్యాలు ఎల్లప్పుడూ కూడా జుట్టుకి అందాన్ని తీసుకుని వస్తాయి అంటుంది మన సోనమ్ కపూర్. ఇవి ప్రత్యేకంగా పెళ్లిళ్లకు, పార్టీలకు అలంకరించినప్పుడు ఎంతో బాగుంటాయని అంటుంది. దీని వలన జుట్టుకు మరింత కొత్త దనం కూడా వస్తుందని వివరిస్తుంది.
శ్రద్ధా కపూర్ : మీ జుట్టు ఎక్కువ కాలం నిలవాలంటే మాత్రం మీ జుట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ రంగు వేయవద్దని సలహా ఇస్తోంది శ్రద్ధా. ఎప్పుడూ కూడా రిబ్బన్లు కట్టుకుని ఉంటే జుట్టు బాగా పెరిగే అవకాశాలున్నాయంటుంది ఈ భామ.