ఏపీ, తెలంగాణ అప్పులపై కేంద్రం ప్రజెంటేషన్ ఇచ్చింది. శ్రీలంక సంక్షోభంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆ దేశ పరిస్థితితో పాటు ఏపీ, తెలంగాణ అప్పులను సైతం కేంద్రం వివరించింది. ఈ రెండు రాష్ట్రాలు పరిమితికి మించి అప్పు చేశాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. తెలంగాణ తరఫున హాజరైన టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు సీరియస్‌గా స్పందించి కేంద్రం తీరును తప్పుపట్టారు. పరిమితికి మించి అప్పులు చేసింది కేంద్ర ప్రభుత్వమేనని, గడిచిన ఎనిమిదేళ్లలో ఎంత అప్పు చేసిందో లెక్కలు వివరించాలని డిమాండ్ చేశారు.
కేవలం విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలనే వేలెత్తి చూపడం వెనక దురుద్దేశం ఉన్నదని ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్రాలు చేసిన అప్పులను శ్రీలంకతో పోల్చడం వెనక మర్మమేంటని కేంద్ర మంత్రిని, అధికారులను ప్రశ్నించారు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నదని, సెకండ్ ప్లేస్‌లో ఉన్నదని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు చేసిన అప్పులు, ఎఫ్ఆర్‌బీఎం, బడ్జెటేతర రుణాల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించిన సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు పై విధంగా స్పందించారు.
శ్రీలంక సంక్షోభం గురించి చర్చిస్తున్న ఈ సమావేశంలో బీజేపీయేతర రాష్ట్రాల అప్పులను ప్రస్తావించాల్సిన అవసరమొచ్చిందని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రమాదకర పరిస్థితికి చేరాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు వివరించారు. దేశంలో పది రాష్ట్రాలు అప్పుల ఊబిలో ఉన్నాయని అఖిలపక్ష సమావేశంలో కేంద్ర అధికారులు పేర్కొన్నారు. శ్రీలంక తరహా పరిస్థితి ఆ రాష్ట్రాల్లో తలేత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. రిజర్వు బ్యాంకు, ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలనూ ప్రస్తావించారు. ఈ నివేదికలు పేర్కొన్న పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ కూడా ఉన్నాయని, అందువల్లనే అప్పుల విషయంలో కేంద్రం నుంచి ముందస్తు హెచ్చరికలు పంపినట్లు అధికారులు గుర్తుచేశారు.
అయితే తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు చేసే అప్పులను ప్రస్తావించడాన్ని టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పరిమితికి మించి కేంద్రం చేసే అప్పులపై కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో ఉందని ఎంపీలు చెప్పారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఉన్నాయని విమర్శించారు.
శ్రీలంక సంక్షోభంపై చర్చించాల్సిందిగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు డిమాండ్ చేయడంతో విదేశాంగ మంత్రి జయశంకర్ అధ్యక్షతన ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్పులపైనా చర్చ జరిగింది. ఈ రెండు రాష్ట్రాలు పరిమితికి మించి అప్పు చేశాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. తెలంగాణ తరఫున హాజరైన టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు సీరియస్‌గా స్పందించి కేంద్రం తీరును తప్పుపట్టారు. పరిమితికి మించి అప్పులు చేసింది కేంద్ర ప్రభుత్వమేనని, గడిచిన ఎనిమిదేళ్లలో ఎంత అప్పు చేసిందో లెక్కలు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అప్పుల గురించి ఆ తర్వాత చర్చిద్దామన్నారు.