నేర చరిత్ర ఉన్న ప్రజా ప్రతినిధులపై దాఖలైన మరో పిటిషన్ లో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నేరారోపణలు రుజువైన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది.
కోర్టులో నేతలపై కేసుల సత్వర విచారణ అభ్యర్థన విచారణ దశలో ఉందన్న కేంద్రం, మరో పిటిషన్ అవసరం లేదని కోర్టుకు తెలిపింది. ఐపీసీ సెక్షన్ల ప్రకారం ప్రజాప్రతినిధులపై శిక్షల విషయంలో ఎలాంటి వివక్ష లేదని కోర్టుకు స్పష్టం చేసింది.