కరోనా వైరస్ సమయంలో కేంద్ర ప్రభుత్వ వివిధ సంస్థలు, వ్యక్తుల నుండి అనేక విరాళాలు సేకరించింది. పీఎం రిలీఫ్ ఫండ్ కు కాకుండా ప్రత్యేకంగా పీఎం కేర్ ఫండ్స్ ను ఏర్పాటు చేసి ఆ మొత్తాన్ని జమ చేసింది. అయితే… పీఎం కేర్ ఫండ్స్ ను పలువురు కోర్టులో ఛాలెంజ్ చేశారు.
ఢిల్లీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం… పీఎం కేర్ ఫండ్స్ అనేవి భారత ప్రభుత్వం నిధులు కావని, విరాళాల రూపంలో వచ్చిన మొత్తాలను ప్రజల కోసమే ఉపయోగిస్తామని తెలిపింది. అయితే, ఇందులో ఎలాంటి అవకతవకలు ఉండవని… నిధుల సమీకరణ అంతా చెక్కులు, ఆన్ లైన్ లావాదేవీల రూపకంగానే జరిగిందని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పీఎం కేర్ ఫండ్స్ నిర్వహణ చూసే పీఎంవో అధికారి పేరుతో ఈ అఫిడవిట్ దాఖలైంది.
పీఎం కేర్స్ అనేది ఒక ఛారిటబుల్ ట్రస్ట్ లాగే పనిచేస్తుందని… ప్రజా ప్రయోజనాల కోసమే ఏర్పాటైందని కోర్టుకు కేంద్రం తెలిపింది. అయితే, ఈ నిధులు ఎక్కడ ఎలా ఖర్చు అయ్యాయో చెప్పే అన్ని వివరాలను పీఎం కేర్స్ వెబ్ సైట్ లో ఉంచుతామని పేర్కొంది.