పెట్రోల్, డీజిల్ పై కేంద్రం అగ్రి సెస్ విధించటంతో ధరలు పెంచుతారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో దాన్ని బడ్జెట్ లో పొందుపర్చామన్నారు.
అయితే, పెట్రోల్-డీజిల్ పై విధించే కస్టమ్ డ్యూటీని తగ్గించిన తర్వాతే అగ్రి సెస్ వేస్తామని… తద్వారా ధరలు పెరగకుండా చూస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. తద్వారా ధరలు పెరగకుండా ఉంటాయని, ఎవరికీ ఇలాంటి ఇబ్బంది లేకుండానే వ్యవసాయ నిధి వస్తుందన్నారు. కేంద్రానికి వచ్చే సెస్ లను మినహాయించిన తర్వాతే ఇవి ఉంటాయన్నారు.