దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు 7 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని, 1200 పక్షులు మరణించినట్లు తెలిపింది. ఒక్క మహారాష్ట్రలోనే 900కోళ్లు మరణించగా… పలు రాష్ట్రాల్లో తీసిన శాంపిల్స్ లో ఫ్లూ కేసులు నిర్ధారించాల్సి ఉంది.
ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన రాష్ట్రాలు
ఢిల్లీ
చత్తీస్ ఘడ్
కేరళ
రాజస్థాన్
మధ్యప్రదేశ్
గుజరాత్
హర్యానా
హిమాచల్ ప్రదేశ్
ఉత్తరప్రదేశ్
ఏపీలో పలు పక్షులు మరణించినప్పటికీ… ఇంకా ఫ్లూ అని నిర్ధారణ కాలేదు. ఇటు తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.