దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ ప్రజలు వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలు స్పెషల్ డ్రైవ్ లను నిర్వహించి ప్రజలకు వ్యాక్సిన్లను వేస్తున్నాయి. అయితే దేశంలో ఇప్పటివరకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారు చాలా మంది ఉన్నారు. దానికి దేశంలో ఉన్న వ్యాక్సిన్ ల కొరత కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అయితే ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విదేశానికి చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కు కేంద్రం అత్యవసర అనుమతులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు దేశంలో ఇస్తున్న వ్యాక్సిన్లు అని రెండు డోస్ లు ఇవ్వాలి. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కావడం విశేషం. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Advertisements
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మందవీయ సోషల్ మీడియాలో జాన్సన్ అండ్ జాన్సన్ అనుమతులపై స్పందించారు. ఈ వ్యాక్సిన్ తో దేశంలో వ్యాక్సిన్ ల కొరత తీరుతుందని అన్నారు. ఇప్పటివరకు నాలుగు వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చామని ఇది ఐదో వ్యాక్సిన్ అని ఆయన పేర్కొన్నారు. కరోనా పోరాటంలో ఈ వ్యాక్సిన్ కూడా భాగం అవుతుందని అన్నారు.