జనవరి 1, 2021 నుండి దేశవ్యాప్తంగా వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను మరోసారి సవరించింది. తాజాగా ఫాస్టాగ్ గడువును ఫిబ్రవరి 15వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫాస్టాగ్ ద్వారా టోల్ గేట్ల వద్ద 80శాతం వరకు చెల్లింపులు జరుగుతుండగా, 100శాతం ఫాస్టాగ్ చెల్లింపులు జరపాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ భావించింది.
ట్రాన్స్ పోర్టు వాహానాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ కావాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది కేంద్రం. చివరకు థర్డ్ పార్టీ బీమా ఫాలసీ తీసుకోవాలన్న ఫాస్టాగ్ ను ఉండాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చింది.