దేశంలో కరోనా వైరస్ దెబ్బకు దాదాపు 5లక్షల మంది మరణించారు. ఓ దశలో రోజువారి కరోనా మృతుల సంఖ్య మూడంకెల సంఖ్య కూడా దాటింది. అయితే, ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కరోనా మృతుల కుటుంబాలకు ఎలాంటి సహయం అందలేదు.
అయితే, సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా కరోనా మృతులకు కేంద్రం తరఫున పరిహారం ఇవ్వబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కరోనా మృతుల కుటుంబాలకు 50వేల రూపాయల పరిహారం ఇస్తామని తెలిపింది. తాజాగా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేసింది.
కరోనా మృతులకు ఇచ్చే 50వేల సహయం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా చెల్లించాలని, దరఖాస్తు పెట్టుకున్న 30రోజుల్లో ఈ పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే, ఈ సహాయం అందించేందుకు కరోనాతోనే మృతి చెందారనే డెత్ సర్టిఫికెట్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.