రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం మరో చట్టం తీసుకరాబోతున్నట్లు తెలుస్తోంది. కార్లలో ఇక నుండి ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్,2021 నుండి అమల్లోకి రానున్న ఈ చట్టంలో… పాత కార్లలోనూ ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాలనే నిబంధనను తీసుకరాబోతున్నారు.
పాత కార్లకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి నిబంధనను జూన్ 1 నుండి అమల్లోకి తీసుకరావాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డ్రైవర్ తో పాటు డ్రైవర్ పక్కన నుండి రెండో ఫ్రంట్ సీట్లలో ఎయిర్ బ్యాగ్స్ ఇక నుండి తప్పనిసరికానున్నాయి. కొత్త కార్లలో బేసిక్ మోడల్స్ లోనూ ఎయిర్ బ్యాగ్స్ లభించనున్నాయి.
సీటు బెల్ట్ లేకుండా ప్రయాణాలు, ఎయిర్ బ్యాగ్స్ లేకపోవటంతో ప్రమాదాల్లో ప్రతిరోజు వందలమంది మరణిస్తున్నారు. దీంతో కేంద్రం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ముసాయిదాపై వివిధ వర్గాల నుండి సలహాలు, సూచనలు తీసుకోనుంది.