కరోనా వైరస్ పై కేంద్రం, ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తూనే ఉంది. కరోనా వైరస్ నివారణ మార్గాలు, చికిత్సపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం…
1. కరోనా చికిత్స తీసుకుంటున్న బాధితులకు వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకపోతే డిశ్చార్జ్ చేయవచ్చు. అయితే ఆ బాధితుడు 10 రోజుల నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి, 3 రోజుల నుండి వరుసగా జ్వరం రాకుండా ఉండాలి. అయితే… డిశ్చార్జ్ అయ్యాక కూడా హోం క్వారైంటైన్ లో ఉండటం తప్పనిసరి.
గతంలో ఓ పేషెంట్ ను డిశ్చార్జ్ చేయాలంటే ఆర్ సీ-పీసీఆర్ టెస్ట్ చేసే వారు. వరుసగా రెండు సార్లు మూడు, నాలుగు రోజుల వ్యవధిలో చేసేవారు. ఆ రెండు సార్లు నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేసేవారు.
2. అంతేకాదు కొద్దిపాటు లక్షణాలుండి, కాస్త ఇబ్బందిపడుతున్నా హోం క్వారెంటైన్ చేసి క్రమం తప్పకుండా జ్వరం చెక్ చేసుకుంటూ మందులు ఇస్తే సరిపోతుందని ఐసీఎంఆర్ రాష్ట్రాలకు సూచనలు చేసింది.