బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు కేంద్రం నో చెప్పింది. మమతా బెనర్జీ రాజకీయ కోణంలో ఈ టూర్ చేస్తున్నట్లుగా భావించి, ఈ టూర్ కు అనుమతి ఇవ్వటం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి సమాచారం వచ్చిందని టీఎంసీ వెల్లడించింది.
అక్టోబర్ లో మథర్ థెరిస్సా స్పూర్తిగా ఇటలీలో ప్రపంచ శాంతి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నిర్వాహకులు సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించారు. అయితే మీ ప్రతినిధులతో కాకుండా రావాలని కోరారు. ఇదే విషయాన్ని కేంద్రంకు చెప్తూ తన విదేశీ పర్యటనకు అనుమతించాలని మమత కోరగా, కేంద్రం నిరాకరించింది.
దీంతో ఈ విషయంలో కేంద్రం తీరును టీఎంసీ తప్పుబట్టింది. రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ ఉంటుందని, కానీ ప్రతిసారి మమత విదేశీ పర్యటనకు నో చెప్పటం ఏంటని ప్రశ్నించింది. ఇందులో కూడా బీజేపీ రాజకీయం చేయటం దారుణమని విమర్శించింది.