మూడు రాజధానుల్లో భాగంగా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావించారు. న్యాయపాలన రాజధానిగా కర్నూలు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు.
ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదన ఏమైనా ఉందా…? ప్రతిపాదన ఉంటే ఎక్కడి వరకు వచ్చింది…? అని అడిగారు. దీనిపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు సీఎం జగన్ ప్రతిపాదించారని, హైకోర్టు పరిపాలన బాధ్యతలన్నీ ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయన్నారు. ఏపీ ప్రభుత్వం, హైకోర్టు మధ్య చర్చలు జరిగి… ఇరువురు ఓకే అంటే తుది నిర్ణయం జరుగుతుందన్నారు. హైకోర్టు పరిపాలన ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున అది వారి నిర్ణయాల మేరకే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ తరలింపు కోసం ఎలాంటి గడువు లేదని ప్రకటించారు.