వివాదాస్పద తీర్పులతో విమర్శలెదుర్కొన్న బాంబే హైకోర్టు జడ్జి పుష్పకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలిజియం చేసిన సిఫార్సులను.. ఇప్పటికే వెనక్కి తీసుకుంది. ఆ స్థానంలో మరో రెండు సంవత్సరాలు అదనపు న్యాయమూర్తిగా మొదట నోటిఫికేషన్ విడుదల చేసింది.
కానీ ప్రభుత్వం మాత్రం ఆమెకు ఒక్క ఏడాదికే అవకాశం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాములుగా అయితే శాశ్వత నియామకానికి ముందు రెండు సంవత్సరాలు అదనపు న్యాయమూర్తిగా అవకాశం ఇస్తారు. కానీ ఈ సారి ఆమెకు ఇవ్వటం లేదని తెలుస్తోంది.
మహిళలను దుస్తులపై నుంచి చాతి భాగంలో తాకినా లైంగిక చర్యగా భావించలేమని జస్టిస్ పుష్పా తీర్పునివ్వగా… సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. మరో కేసులోనూ బాలికల చేతులను పట్టుకోవటం, వారి ముందు ప్యాంట్ జిప్ తీయటం వంటివి లైంగిక వేధింపుల కిందకు రావంటూ తీర్పునిచ్చారు.
ఈ రెండు వివాదాస్పద తీర్పుల తర్వాత ఆమెపై సుప్రీంకోర్టు కొలిజియం తమ సిఫార్సులను వెనక్కి తీసుకుంది.