సీఎం కేసీఆర్ అనూహ్యంగా బీజేపీ వైపు మళ్లారు. ఢిల్లీని వణికిస్తానంటూ ప్రకటనలు చేసిన కేసీఆర్… ఇప్పుడు మోడీ సర్కార్ కుక జీ హుజూర్ అనాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏదైనా కేసీఆర్ బీజేపీ కేంద్ర నాయకత్వానికి సరెండర్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కొత్త పార్లమెంట్ నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ కు మద్ధతు, రైతుల చట్టాల అమలు వంటి చర్యల తర్వాత కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ కు రిటర్న్ గిఫ్ట్ పంపింది.
సీఎం కేసీఆర్ కొత్త పార్లమెంట్ నిర్మాణానికి మద్ధతు పలికారు. ఇక్కడ కేసీఆర్ కట్టాలనుకుంటున్న కొత్త సచివాలయం కోసమే అని అంతా అనుకున్నారు. కానీ ఇది హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉంది. ఇక్కడ అనుమతులు అంత హిజీ కాదు. పైగా కేంద్రం చేతిలో పని. మరోవైపు ఎంపీ రేవంత్ రెడ్డి వంటి లీడర్లు కేసులతో దూకుడు మీదున్నారు. హుస్సేన్ సాగర్ పరివాహాక ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు ఎలా చేస్తారంటూ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు కూడా వేశారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో కేసీఆర్ కు ఊరటనిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తైనా… పర్యావరణ అనుమతుల కోసం వేచి చూస్తుండగా, కేసీఆర్ కు కొత్త సంవత్సరం కానుకగా మోడీ సర్కార్ అనుమతులన్నీ ఇచ్చేసింది.