కొంతకాలంగా సంక్షేమ కార్యక్రమాలతో ఇబ్బడిముబ్బడి ఏపీ సర్కార్ అప్పులు చేస్తుందన్న విమర్శలున్నాయి. ఏపీకి ఉన్న ఆర్థిక ఇబ్బుందులకు తోడు పెరుగుతున్న అప్పులతో ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలివ్వటం కూడా కష్టంగా మారింది. నెలాఖరు వచ్చిందంటే చాలు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆర్బీఐ, కేంద్రంతో అప్పుల కోసం సంప్రదింపులు జరపాల్సి వస్తుంది.
ఈ దశలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న రాష్ట్రాలకు మరింత అప్పులు తీసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇలా మొత్తం 11 రాష్ట్రాలకు కొత్తగా అప్పులు చేసుకునేందుకు వీలు కల్పించగా అందులో ఏపీ కూడా ఉంది. కేంద్రం ఇచ్చిన తాజా అవకాశంతో ఏపీ సర్కార్ అదనంగా మరో 15,721కోట్ల నిధుల సమీకరణకు అవకాశం ఏర్పడింది.