వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఓవైపు తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతుండగా, కేంద్రం మాత్రం వెనక్కి తగ్గటం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పార్టీలకు అతీతంగా నేతలు, మేధావులు, కార్మికులు ఒక్కటై పోరాటం చేస్తుండగా… కేంద్రం మాత్రం ప్లాంట్ ను అమ్మేసే చర్యలను స్పీడప్ చేసింది.
ఇప్పటికే కొత్త ఎండీని నియమించిన సర్కార్… తాజాగా స్టీల్ ప్లాంట్ అమ్మకం కోసం లీగల్ అడ్వైజర్స్ నియామకానికి రెడీ అయ్యింది. ఇప్పటికే పలు కంపెనీల నుండి బిడ్స్ దాఖలు కాగా 5కంపెనీలు అర్హత సాధించాయి. ఈ నెల 30న తమ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆ 5 కంపెనీలను కేంద్రం ఆదేశించింది. వచ్చే నెలలో లీగల్ అడ్వైజర్ల నియామకం పూర్తి చేయనున్నారు.
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ప్రాణం పోసిన స్టీల్ ప్లాంట్ ను తాము మళ్లీ లాభాల్లోకి తెచ్చుకుంటాం అని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని కార్మికులు మండిపడుతున్నారు.