ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీకి కేంద్రం నివేదిక ఇచ్చింది. పర్యావరణ, అటవీశాఖ ఇచ్చిన నివేదికలో ప్రస్తుతం పనులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఈ పథకంకు సంబంధించి కృష్ణానదీ బోర్డు ఇచ్చిన నివేదికను కేంద్రం ఎన్జీటీలో ప్రస్తావించింది. పర్యావరణ అనుమతులు కూడా పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది.
అయితే, అక్కడ ఇప్పటి వరకు జరిగిన పనులు చూస్తే డీపీఆర్ తయారీ కోసం జరిగినట్లుగా కనిపించలేదని చెన్నై ఎన్జీటీ ధర్మాసనం వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా లేదా అన్న అంశంలో తమ వాదనలు వినాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఇందుకోసం కొంత సమయం కోరింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపకుండా జరుపుతున్నారని ఫోటోలు, వీడియోలు ఎన్జీటీకి చేరాయి. దీనిపై ఈనెల 16న వాదనలు జరగనున్నాయి.