కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రామేశ్వర్ రావుకు చెందిన మై హోమ్ గ్రూప్ మైనింగ్ అవకతవకలపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంపై కేంద్ర మైనింగ్ అండ్ కోల్ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్, జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర కుమార్ ని కలిశానని ఎంపీ ఆరవింద్ అన్నారు.
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మేనేజ్ చేసి, కేంద్రానికి తప్పుడు సమాచారం అందిస్తూ, ఇంత భారీ ఎత్తున అవకతవకలు చేస్తూ, ఖజానాలకు వందల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ‘ మై హోమ్’ గ్రూప్ గురించి విని, అధికారులు మొదట ఆశ్చర్యపోయారని ఎంపీ అరవింద్ అన్నారు. అనంతరం ఈ సంస్థపై విచారణ వేగాన్ని పెంచుతామన్నారన్నారని అరవింద్ ప్రకటించారు.