తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో8, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23న చివర తేదీగా నిర్ణయించింది. మార్చి 13న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలుతున్నారు.
ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు, కడప- అనంతపురం- కర్నూలు, తెలంగాణ నుంచి హైదరాబాద్ –రంగారెడ్డి–మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలను నిర్వహించనున్నారు.
పట్టభద్రుల నియోజకవర్గాల్లో ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు, కడప- అనంతపురం- కర్నూలు, శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.