అమ్మ ప్రేమకు మించినది లేదు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తన కూతురు పరకాల వాఙ్మయిపై ఉన్న ప్రేమను చాటుతూ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత విషయాలు అంతగా వెల్లడించని నిర్మల సీతారామన్ తన తనయ వాఙ్మయి, భర్త పరకాల ప్రభాకర్‌తో ఉన్న చిత్రాన్ని, కూతురుతో దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేసుకుని ప్రేమను ప్రకటించారు.
కూతుర్ల గురించి ఎంతైనా చెప్పొచ్చు. నా స్నేహితురాలు, ఫిలాసఫర్, మార్గదర్శకురాలు కూతురే. హిందులో జర్నలిస్టుగా పని చేస్తున్న వాఙ్మయి విద్య, వైద్యం, ప్రజా విధానాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా కేంద్రీకరించి వాటిని వెలుగులోకి తెస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలమ్మ కన్నతల్లి ప్రేమ ట్వీట్ అందరిని ఆకట్టుకుంటోంది.
Can say so much and more about daughters. A #throwbackpic with my daughter. A friend, philosopher and a guide. Here’s this on #DaughtersDay pic.twitter.com/640XrUqm2n
— Nirmala Sitharaman (@nsitharaman) September 22, 2019