కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుండి వారం గడుస్తుంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి అనుకున్నంతగా అడ్డుకట్టవేయలేకపోయామన్న అభిప్రాయం అయితే ఉంది.
మరోవైపు లోకల్ ట్రాన్సిమిషన్ కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇది మరింత పెరిగితే… దాన్ని ఆపటం చాలా కష్టం. కానీ లాక్ డౌన్ విధించినప్పటికీ రాష్ట్రంలో ప్రజలు ఇంకా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇరకాటంగా మారటంతో… కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. శనివారం నుండి గల్లీల్లో కేంద్ర బలగాలు గస్తీ కాయబోతున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూ పకడ్భందిగా అమలులో ఉండేలా చూడటంతో పాటు… 31 వరకు ఉన్న లాక్ డౌన్ ను ఏప్రిల్ 14వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పరిస్థితిని బట్టి కర్ఫ్యూ ఉన్న గంటలను పెంచే అవకాశం కూడా లేకపోలేదు.