ఏపీ, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్రం అవకాశాన్ని కల్పించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అదనంగా రూ.16,728 కోట్ల రుణాలు తీసుకునేందుకు వెసలుబాటు ఇచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్, వన్ నేషన్- వన్ రేషన్ , పట్టణ, స్థానిక సంస్థలు, విద్యుత్ రంగాల్లో సంస్కరణలు వంటి అంశాలను అమలు చేసినందుకు ఈ సౌలభ్యాన్ని కల్పించింది.
కేంద్రం ఇచ్చిన వెసలుబటుతో తెలంగాణ రూ. 2508 కోట్లు, ఏపీ రూ.2,525కోట్లు అదనంగా రుణం తీసుకోవడానికి వీలుంది. ఏపీ, తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో దాదాపు ప్రథమ స్థానంలో ఉంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే వన్ నేషన్- వన్ రేషన్ ప్రాజెక్ట్ కొనసాగుతుండగా, ఏపీలో విద్యుత్ సంస్కరణలు అమలవుతున్నాయి.