ఏపీ రాజధాని వివాదంలో తమ పాత్రపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదేనంటూ స్పష్టం చేసింది.రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తేల్చి చెప్పింది. రాజధాని అంశంపై ఈ మేరకు హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.చట్ట సభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్రం అభిప్రాయపడింది.
మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఇటీవల హైకోర్టులో అఫిడవిట్ దాఖలైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నేడు కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీని నియమించామని గుర్తు చేసిన కేంద్రం… అమరావతి ఎంపికలోగానీ, మూడు రాజధానుల ఏర్పాటులోగానీ ఏ విధంగా జోక్యం చేసుకోలేదని అఫిడవిట్‌లో తెలిపింది.