దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలంటూ రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా ఆదేశించింది. ప్రజలకు ఇబ్బంది అవుతుందని తెలుసు, కానీ తప్పటం లేదు… ఇది జీవన్మరణ పోరాటం, ఇబ్బంది పడుతున్న ప్రజలు నన్ను క్షమించండి అంటూ ప్రధాని మోడీ దేశ ప్రజలను కోరారు.
అయితే, కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో తగ్గదని… లాక్ డౌన్ ను ఇంకా పొడిగించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. లాక్ డౌన్ ను మరోసారి పొడిగిస్తారని, కొన్ని నెలల పాటు ఇండియా లాక్ డౌన్ లోనే ఉండబోతుంది అంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం వివరణ ఇచ్చింది.
లాక్ డౌన్ ను పొడిగించే ఉద్దేశం, ప్రణాళిక లేదని… అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టి పారేసింది. దేశంలోకి ఎంటరైన కరోనా వైరస్ ప్రభావం సోషల్ డిస్టెన్సింగ్, ఐసోలేషన్ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండేందుకే లాక్ డౌన్ విధించామని, ప్రస్తుతం అమలులో ఉన్న 21 రోజుల లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్ కట్టడికి అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గుబా ప్రకటన జారీ చేశారు.
FAKE NEWS ALERT ?
PBNS got in touch with the Cabinet Secretary on this news article.
The Cabinet Secretary expressed surprise & said that there is no such plan of extending the lockdown. https://t.co/CrLlp6f7X5
— Prasar Bharati News Services (@PBNS_India) March 30, 2020
ఇక సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు సృష్టించే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.