ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల నామినేషన్లు విడుదలైనా… దాన్ని రీషెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి దశ నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 10కు రీషెడ్యూల్ చేశారు. మిగిలిన మూడు దశల ఎన్నికలను యధావిధిగా కొనసాగించనున్నారు. మొదటి దశను నాలుగో దశగా మార్చారు. ఫిబ్రవరి 9, 13, 17, 21తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల కమిషనర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలకు సిద్ధంగా లేమంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎన్నికలు జరిపేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సెక్రటరీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఇక సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో కమిషనర్ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో ఇక ముందు ఏం చేద్దాం అనే అంశంపై సీఎం జగన్ తో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దెరెడ్డి రాంచంద్రారెడ్డి అత్యవసర సమావేశం అయ్యారు.