కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ నియంత్రణ చర్యలను వేగవంతం చేసింది. ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. మాస్కులు వాడకం, భౌతికదూరం వంటి అంశాలపై అవగాహన కలిగిస్తుంది. దీంతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. వ్యాక్సిన్ల పంపిణీలో వెనకబడ్డ రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన 10 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది.
కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్‌లలో మల్టీ-డిసిప్లీనరీ కేంద్ర బృందాల పర్యటించనున్నాయి. వ్యాక్సినేషన్ కు ఉన్న సమస్యలపై ఆ బృందాలు అధ్యయనం చేనున్నాయి.
కాగా.. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 415 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.