కరోనా నివారణ కోసం రూపొంచిందిన మరో వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్‌కు కేంద్రం తాజాగా అనుమతిని ఇచ్చింది. అత్యవసర వినియోగం కింద ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి రావడంతో.. వ్యాక్సిన్ల కొరతను భారత్‌ను మరింత అధిగమించనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం పొందాయి. ఈక్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ ఇండియాలో ఉపయోగిస్తున్న ఐదో కంపెనీ టీకా కానుంది. మొత్తంగా ఈయూ ఏజెన్సీ ఆమోదించిన 5 టీకాలూ ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నాయని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌తో కరోనాపై భారత్ పోరాటం మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.