కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్ లో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేస్తూ లేఖలు రాసింది.
కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్..
ఒమిక్రాన్ పై అప్రపమ్తతంగా ఉంటూ పరిస్థితిని నిరంతరం సమీక్షించాలి
ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలితే వారిని ఐసోలేషన్ లో ఉంచాలి. వారి నమూనాలతో ఒమిక్రాన్ నిర్థారణ పరీక్షలు చేపించాలి.
కరోనా సోకిన వారిని కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి పరీక్షలు చూపించాలి. వారిని ప్రత్యేకంగా ఉంచాలి.
విదేశాల నుంచి వచ్చిన వారిని పరిశీలించేందుకు ప్రత్యక టీంలను ఏర్పాటు చేయాలి.
శీతాకాలం ప్రారంభం కావడంతో కాలుష్యం ఎక్కువగా ఉండే రాష్ట్రాలలో శ్వాశకోస సమస్యలు ఉన్నవారిని పరీక్షించాలి.
కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.